విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: ఐక్యూ సినిమా యువతకు ఆదర్శంగా నిలుస్తుందని సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పార్థసారథి , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర సహాయక కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. శనివారం పీవీకే కే ఇంజనీరింగ్ కళాశాలలో ఐక్యూ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. చిత్రాన్ని నిర్మాత కాయగూరల లక్ష్మీపతి, దర్శకత్వం జిఎల్వి శ్రీనివాస్,నెట్టం వెంకటేష్, కథ మాటలు ఘటిక చలం, హాస్యం, యువతుకు మార్గదర్శకం, స్ఫూర్తిదాయకంగా అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో చిత్రం బృందం సభ్యులు, విద్యార్థులు,జిల్లా ప్రజలు పాల్గొన్నారు.