విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనము నందు శుక్రవారం మండల అధ్యక్షులు గీత రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశము నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొని సమావేశం నిర్వహించారు ఆమె సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఉన్న సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారులు కలసి సమస్యలను పరిష్కరించి మండల అభివృద్ధికి తోడ్పడుదామని తెలిపారు అనంతరం శాఖ వారిగా రివ్యూ నిర్వహించారు అంగన్వాడి భవనాలు అనాధ పిల్లల గురించి అలాగే ప్రకృతి గురించి చెట్లు నాటడం అడవుల పెంపకం గురించి గ్రామాలలో త్రాగునీటి సమస్యలను అలాగే కార్మిక శాఖ నుంచి కార్మికులకు ఉన్న సంక్షేమ పథకాలు వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలని వివరంగా తెలపడం జరిగింది ఉపాధి హామీ కూలీలు ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఎలా చర్యలు తీసుకోవాలని తెలిపారు అలాగే గ్రామాలలో రోడ్ల పరిస్థితి గురించి సర్పంచులు అడగక వాటిని పరిష్కారం చేస్తామని నాణ్యమైన రోడ్లు వేయడానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు గ్రామాలలో నెలకొన్న సమస్యలను తీర్చడానికి అందరూ కృషి చేయాల్సిందిగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివశంకరప్ప, సుబ్రహ్మణ్యం, మండలం ఉపాధ్యక్షులు రామాంజనేయులు, ఉపాధి హామీ సిబ్బంది, గృహ నిర్మాణ శాఖ, కార్మిక శాఖ అధికారులు, సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు,