Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

ముఖ్య అతిధి రిటైర్డ్ ఉద్యోగి ముత్యాలప్ప
విశాలాంధ్ర – ధర్మవరం : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, అన్ని వయసుల వారికి విద్య విషయంలో ఎంతో ఉపయోగకరమైన దేవాలయం అని రిటైర్డ్ ఉద్యోగి ముత్యాలప్ప, ఎల్ఐసి ఏజెంట్ నాగరాజు, ఉపాధ్యాయులు కమల తెలిపారు. ఈ సందర్భంగా రెండవ రోజు పట్టణములోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో మంగళవారం పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ పుస్తక ప్రదర్శన విద్యార్థిని, విద్యార్థులకు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా, గ్రంథాలయాల్లో ఉంటూ విజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఉందన్నారు. విద్యకు సంబంధించిన పుస్తకాలు ఎవరి దగ్గరైనా ఉన్న ఎడల, వాటిని గ్రంథాలయానికి విరాళంగా ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, గంగాధర్, శివమ్మ, ముకుంద, అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img