Friday, April 19, 2024
Friday, April 19, 2024

శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేత

3 గేట్ల ద్వారా 82 వేల క్యూసెక్కుల నీరు విడుదల
సంతోషంగా ఉంది మంత్రి అంబటి


విశాలాంధ్ర శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి ఎగువ కురుస్తున్న భారీ వరదల కారణంగా లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరడంతో శ్రీశైల జలాశయం మట్ట గరిష్టస్థాయికి చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్థానిక శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి మూడు గేట్లు ఎత్తి 82000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు ముందుగా కృష్ణవేణీ నదీ తల్లికి చీర సరే పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు మంత్రి అంబటి రాంబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళాడా ఎన్నికల ప్రచారానికి వెళ్లారో అని తెలుసు కోవాలని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబునాయుడుకు లేదని ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు గత సంవత్సరం కంటే ముందుగా వర్షాలు రావడం డ్యాములు కాలువలు నదులు నిండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ సంవత్సరం రైతులకు నీరు సమృద్ధిగా ఉంటుందని మంచి వర్షాలు కురిసి అందరూ బాగుండాలని తన చేతుల మీదగా గేట్లు వెళ్ళటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు అంతకు ముందు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ను దర్శించుకుని సేవించుకున్నారు వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న సాదర స్వాగతం పలికారు స్వామి వారికి అభిషేకము అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు వీరితో పాటు స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సామున్ పోచ బ్రహ్మానంద రెడ్డి మరియు అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img