Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సిమెంట్ రోడ్ పనులు పరిశీలించిన మేయర్ వసీం

విశాలాంధ్ర – అనంతపురం : నగరంలోని 35వ డివిజన్ పరిధిలో రూ.18 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సిమెంట్ రోడ్ పనులను శనివారం నగర మేయర్ మహమ్మద్ వసీం పరిశీలించారు. పనులు వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సహకారంతో నగరంలోని ప్రధాన రోడ్ల తోపాటు అంతర్గత రహదారుల అభిరుద్ది కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్,బాబా ఫక్రుద్దీన్,,నాయకులు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి,,ఖాజా ,డీఈ రాంప్రసాద్ రెడ్డి తోపాటు పలువురు అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img