Friday, April 26, 2024
Friday, April 26, 2024

హలహార్వి గ్రామంలో చర్చి నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి

కర్నూలు జిల్లా : విశాలాంధ్ర : నందవరం మండల పరిధిలోని హలహార్వి గ్రామంలో నిర్మిస్తున్న టీవీఎం చర్చి నిర్మాణాన్ని మంగళవారం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అందరి మతాలు గౌరవిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాలు నిర్మాణం కోసం, మౌలిక సదుపాయాలు, పునర్నిర్మాణానికి, ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. అందులో భాగంగానే హలహార్వి చర్చి నిర్మాణం కోసం 20లక్షల రూపాయలు వచ్చేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ బిసి సెల్ అధ్యక్షులు, ముగతి విరుపాక్షిరెడ్డి, ఎంపిటిసి దావీదు, నాయకులు శాంతిరాజు, జయరాజు, సావిత్రమ్మ, తిమ్మప్ప, పాష్టర్ జాన్ మోజేష్, ఆనంద్, డెవిడ్, రాముడు, దేవపాల్, దాస్, ప్రభుదాసు, మణి, రాజ్, మోషన్న,దుబ్బన్న, అనోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img