Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రకృతి మానవాళి ప్రగతికి జీవనాడి

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: ప్రకృతి మానవాళి ప్రగతికి జీవనాడి అని మున్సిపల్ డెప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎం. అనంత రాముడు పేర్కొన్నారు. శుక్రవారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో పర్యావరణం,శారీరక దృఢత్వం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న మొక్కలను కాపాడుకుంటూ.. కాలుష్యం నిర్మూలన చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలన్నారు. అనంతరం ఎస్కేయూ యూనివర్సిటీ ఫిజికల్ అసిస్టెంట్ డైరెక్టర్ బి జెస్సి మాట్లాడుతూ..ఆధునిక ప్రపంచంలో ప్రతి మనిషి జీవన శైలి మారిపోయిందని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై దృష్టి పెట్టి వ్యాయామం, యోగ, క్రీడలు , ఆరోగ్యకరమైన ఆహారం వల్ల శరీర దృఢత్వాన్ని పొంది సంపూర్ణ ఆరోగ్యానికి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా వి. మూర్తి రావు ఖోకలే , నైపుణ్యాభివృద్ది సంచాలకులు డా. ఏం. సురేంద్ర నాయుడు , వైస్ ప్రిన్సిపాల్ డా. బి. రామసుబ్బారెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img