Friday, April 26, 2024
Friday, April 26, 2024

సి పె ట్ డిప్లమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : భారత ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ డిప్లొమా కోర్సులకు విద్యార్థుల నుంచి ఆన్లైన్ విధానంలో డబ్లూ డబ్ల్యూడబ్ల్యూ, సీఐపీఈటీ, జీవోవీ. ఐఎన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు జాయింట్ డైరెక్టర్, హెడ్ డాక్టర్ శేఖర్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. మూడు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్స్టాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సులకు పదో తరగతి పాస్, చదువుతున్న విద్యార్థులు, 2 సంవత్సరాల వ్యవధి గల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ పీపీటీ) కోర్సుకు బీఎస్సీ పాస్, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 250, ఓబీసీ, జనరల్ విద్యార్థులు రూ.500 ఆన్లైన్లో రుసుము చెల్లించి ఈ నెల 28వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. విజయవాడ, అనంతపురం కేంద్రా లలో జూన్ 11వ తేదీన సీఐపీఈటీ అడ్మిషన్ టెస్ట్ ఆన్లైన్ పరీక్ష ఉంటుందన్నారు. | జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా నిబంధనలను అనుసరించి అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పించిందన్నారు. విద్యార్థులకు విడివిడిగా హాస్టల్ సదుపాయం కలదని తెలిపారు. కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు అసిస్టెంట్ టెక్ని కల్ అధికారి శ్రీను 6300147965 ఫోనెనెంబర్ను సంప్రదించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img