Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఉగాదికి కసాపురం ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

విశాలాంధ్ర-గుంతకల్లు: కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లపై సోమవారం కసాపురంలోని రామదూత నిలయంలో అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవీంద్ర మాట్లాడుతూ
ఏటా మూడు రోజులపాటు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. ఉత్సవాలలో భక్తుల రద్దీ ఉంటుందని అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఉగాది వేడుకలకు భారీగా తరలివచ్చే భక్తులకు ఆహార పానీయాలు తదితర ఏర్పాట్ల కోసం దేవస్థానం అధికారిరులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. తగినన్ని గదులు లేని కారణంగా రాత్రి నిద్రకు వచ్చే భక్తులు అందరికీ గదులు ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో ఆలయ
అధికారులు డార్మేటరీని ఉచితంగా వినియోగించుకునే ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవస్థానం కల్యాణ మండపాలను అద్దెకు కేటాయించకుండా,భక్తుల వసతికి వినియోగిస్తున్నారు.దొంగల బెడద నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు, తాగునీరు, వైద్యం, భద్రత,పారిశుధ్యం తదితర అంశాలపై ఆయా శాఖల అధికారుల సమీక్షతో విదులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో, ఆలయ ధర్మకర్త సుగుణమ్మ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ,ఆలయ ఏఈఓ ధనుంజయ, ఆలయ అధికారులు నాగేశ్వర్ రెడ్డి ,ప్రధాన అర్చకులు గరుడాచార్యులు, ఆర్డబ్ల్యూఎస్ దత్తు, పంచాయతీ సెక్రెటరీ రామలింగ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img