Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

క్యాన్సర్ వ్యాధిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

చెన్నై కొత్తపల్లి ప్రభుత్వ దంత వైద్యులు డాక్టర్ వివేక్
విశాలాంధ్ర – ధర్మవరం : క్యాన్సర్ వ్యాధిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చేనేకొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దంత వైద్యులు డాక్టర్ వివేక్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని కోట మున్సిపల్ పాఠశాలలో క్యాన్సర్ నివారణ-వాటిపై అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధూమపానము, పొగాకు ఉత్పత్తులు, తంబాకు, గుట్కా, బీడీ, సిగరెట్ లను సేవించడం వలన క్యాన్సర్ వ్యాధి రావడం జరుగుతుందన్నారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే 200 రూపాయల నుంచి ఆ పై వరకు జరిమానా ఉంటుందని వారు తెలిపారు. తదుపరి పాఠశాలలోని 30 మంది విద్యార్థులకు కూడా దంత వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. దీంతోపాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తూ దంటముల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వాటిపై కూడా అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img