Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రికార్డులు సక్రమంగా నిర్వహించాలి

అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్

విశాలాంధ్ర – పెద్దకడబూరు :పాఠశాల నిర్వహణ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం ను అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు ఇచ్చిన స్టాక్ వివరాలను సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థుల సంఖ్యను బట్టి వారికి ఇచ్చే సరుకులు ఖచ్చితంగా ఇవ్వాలని సూచించారు. 8వ తరగతి విద్యార్థుల యొక్క బైజూస్ ట్యాబ్ వినియోగాన్ని పరిశీలించి విద్యార్థులను అభినందించారు. 10వ తరగతి విద్యార్థులు సైన్స్ పరీక్షను జాగ్రత్తగా రాయాలని, భొతిక శాస్త్రం కు సంబంధించిన జవాబులు, జీవశాస్త్రం కు సంబంధించిన జవాబులు వేరు వేరు బుక్ లెట్ లో రాయాలని సూచనలు ఇచ్చారు. పాఠశాల క్రీడా స్థలాన్ని వినియోగంలోకి తెచ్చుకోవాలని, అందుకు పాఠశాల గ్రాంట్ ను వినియోగించుకోవాలని తెలిపారు. నాడు నేడు అదనపు తరగతి గదులు 8 మంజూరు అయినట్లు,వాటి నిర్మాణాన్ని నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీసిడీఓ సునీత, ప్రత్యేక అధికారిణి చైతన్య స్రవంతి, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ లక్ష్మన్న,అకౌంటెంట్ సురేష్ రెడ్డి,సిఆర్పి లక్ష్మన్న, ఐఈఆర్టి గోపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img