Friday, April 26, 2024
Friday, April 26, 2024

గుంతకల్లులో వాడవాడలా రెపరెపలాడిన ఏఐటియుసి ఎర్రజెండా

ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : దేశంలో బిజెపి పాలనలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మికులను బానిసత్వ సంకెళ్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని దేశవ్యాప్తంగా కార్మికులందరూ ఏకమై బీజేపీని గద్దె దింపేందుకు కలిసికట్టుగా రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ పిలుపునిచ్చారు.సోమవారం 137 వ మే డే కార్మిక రోజుని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య అతిధులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ ,26 వ వార్డు సీపీఐ కౌన్సిలర్ బోయ లక్ష్మి ,2 వ వార్డు సీపీఐ మాజి కౌన్సిలర్ రమాదేవి పాల్గొన్నారు. ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య అధ్యక్షతన వహించారు. ఈ సందర్బంగా పాత గుంతకల్లు హమాలి కార్యాలయం ఆధ్వర్యంలో ఏఐటియుసి పథకాన్ని ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో, మిల్లు హమాలి కార్యలయం ,పాత గుంతకల్లు హమాలి కార్యాలయం, హమాలి కాలనీ లో ,మున్సిపల్ కార్యాలయం ,బీటి పక్కిరప్ప కాలనీ, ఏఐటియుసి కాలనీ ,జిన్నింగ్ హమాలి, ఎస్టేట్ కార్మికుల ఆధ్వర్యంలో ఏ ఐ టి యు సి పథకాన్ని నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి. జగదీష్ మాట్లాడుతూ…మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాక కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కేంద్రం రద్దు చేసిందన్నారు.రాష్ట్రంలో హక్కుల కోసం ఉద్యమిస్తే, పోరాడితే, ప్రశ్నిస్తే, అక్రమంగా కేసులు పెడుతున్నారని అన్నారు. కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా నిబంధనలన్నీ వారి గుప్పెట్లో పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ సంపదలను అంబానీ, అదానీలకు దోచి పెడుతున్నారని తెలిపారు. మోడీ చెప్పినట్లుగా జగన్ పాలన సాగిస్తూ.. కార్పోరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టు బెడుతున్నారని అన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను నరేంద్ర మోడీ తీసుకువస్తున్నాడని నల్ల చట్టాలను కట్టడి చేసేందుకు కార్మికుల హక్కులను సాధించుకునేందుకు మరోసారి కార్మికులంతా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సురేష్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ పట్టణ మండల సహాయ కార్యదర్శులు ఎస్ఎండి గౌస్, రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర ,ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసి కుల్లాయప్ప ,హమాలీలు బండయ్య,లింగమయ్య,ఈరన్న ,బాబా ఫక్రుద్దీన్ ,చెరువు నాగన్న, రామాంజనేయులు,చిదాంబరం,లింగ, సిపిఐ నాయకులు మల్లయ్య ,పుల్లయ్య,దౌలా, షబ్బీర్,వంశికిృష్ణ,నందు,మున్సిపాల్ నరసయ్య,దాస్ ,కొండయ్య,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img