Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేడు మెడికల్ కళాశాలలో 2022వ బ్యాచ్ ఎంబిబిఎస్ విద్యార్థుల తెల్ల కోటు ఉత్సవం

ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ మై రెడ్డి నీరజ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రభుత్వ వైద్య కళాశాలలో సెంట్రల్ హాలులో ఉదయం 10 గంటలకు 2022వ బ్యాచ్ నూతన వైద్య విద్యార్థిని విద్యార్థులకు పరిచయ కార్యక్రమం మరియు తెల్ల కోటు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ మైరెడ్డి నీరజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపాల్ లు, అన్ని విభాగాల ప్రధాన విభాగాధిపతులు, ఆచార్యులు ,సహాచార్యులు, దేశ నలుమూలల నుంచి వచ్చిన 2022 వ బ్యాచ్ నూతన మెడికల్ స్టూడెంట్స్ పాల్గొననున్నారని ప్రిన్సిపాల్ నీరజ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img