Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సాఫ్ట్ బాల్ జాతీయ పోటీల్లో విన్సెంట్ డిపాల్ విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర-రాప్తాడు : గత నెల 25 నుండి 29వ తేదీ వరకు కర్నూలు నగరంలో జరిగిన 35వ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో ఏపీ జట్టు తరపున అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని సెయింట్ విన్సెంట్ పాఠశాలలో చదువుతున్న జి.మౌనికప్రియ బాలికల విభాగంలో, బాలుర విభాగంలో ఎ.భానుశంకర్ ఏపీ జట్టు తరపున అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండు విభాగాలను ఏపీ జట్టును మొదటి స్థానంలో రాణించడానికి కీలకపాత్ర పోషించాలని పీఈటీ నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ జ్ఞానమ్మ, హెచ్ఎం సిస్టర్ అమల, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను శుక్రవారం అభినందించారు. సిస్టర్ అమల మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో కూడా బాగా రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో రాణించిన ఈ విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలని పీఈటికీ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img