Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నిరంతర ప్రక్రియలో నేరం నియంత్రిస్తాం

వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం


విశాలాంధ్ర – ధర్మవరం:: గత కొన్ని నెలలుగా పట్టణంలో ఏటీఎం, బ్యాంకులు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు, జువెలరీ షాపుల వద్ద నేర చరిత్ర కలిగిన వారు దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించేందుకై వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ప్రణాళికతో నిరంతర ప్రక్రియను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం వారు బ్యాంకుల మేనేజర్లతో గోల్డ్ షాపుల యజమానులతో ప్రత్యేకంగా చర్చించి, నియంత్రణకు సహకరించాలని తెలిపారు. తదుపరి ముఖ్యమైన కూడలిలు లలో అనుమానితుల వద్ద”పాత నేరస్తుల ఫింగర్ప్రింట్ మిషన్ ద్వారా”వేలిముద్రలను తీసుకొని విచారణ జరుపుతున్నారు. ప్రజలతోపాటు చిన్న, పెద్ద వ్యాపారస్తులు తాము చేసే వ్యాపారాలలో వచ్చే డబ్బులు అతి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని తెలిపారు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద, డబ్బులు డ్రా చేసుకునేవాళ్లు తమ డబ్బును అతి జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడే వాటికి భద్రత ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మా సిబ్బంది ద్వారా చేయించి నేరాలను తప్పనిసరిగా నియంత్రించేందుకు కృషి చేస్తామన్నారు. పై తెలిపిన ప్రదేశాలలో ఎవరైనా అనుమానితులుగా కనపడితే ప్రజలు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. తదుపరి ప్రభుత్వ కళాశాలలు, ఉన్నత పాఠశాలలో యూటీజ్ చేయకుండా తగిన అవగాహన సదస్సులు కూడా విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా గట్టి చర్యలు చేపట్టి పోలీసులకు సహకరించాలని తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు కసరత్తును కూడా ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img