Monday, June 5, 2023
Monday, June 5, 2023

చేనేత పరిశ్రమను కాపాడుకునేంతవరకు మా పోరాటాలు సలుపుతాం

ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి

విశాలాంధ్ర – ధర్మవరం : చేనేత పరిశ్రమలు కాపాడుకునేంతవరకు మా పోరాటాలు సలుపుతామని, ఇందుకు చేనేత కార్మికులందరూ కూడా ఐక్యమత్వముతో ఉంటేనే విజయం సాధిస్తామని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం కాయగూరల మార్కెట్ వద్ద గల జి ఆర్ బి ఫంక్షన్ హాల్ లో నేతన్నల సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జింక చలపతి తో పాటు నియోజకవర్గ కార్యదర్శి మధు, పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి వై రమణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, తాలూకా కార్యదర్శి వెంకటనారాయణ, అధ్యక్షులు వెంకటస్వామి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జింకా చలపతి మాట్లాడుతూ మర మగ్గాలలో చేనేత రిజర్వేషన్ చట్టమును సరిగా అమలు కావడం లేదని, జిల్లా కలెక్టర్, హ్యాండ్లూమ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లనే నేడు చేనేత కార్మికుల జీవన పరిస్థితులు ఆగమేగోచరంగా తయారైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరమగ్గాల యజమానులతో అధికారులు కుమ్మక్కై తనిఖీలు తూతూ మంత్రంగా జరుపుతూ తమ వ్యాపారాలను చక్కగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతోందని తెలిపారు. మరి నేడు చేనేత పరిశ్రమను, చేనేత కార్మికుని కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. చేద్దామంటే నేడు చేనేత కార్మికులకు పని లేదని, చేసిన పనికి కూలి లేదని, నేర్దామంటే మగ్గం లేదని, నేసిన చీరకు గిట్టుబాటు ధర లేదని తెలిపారు. చేనేత కార్మికులకు దారి ఎక్కడ ఉందని, వీరి భవిష్యత్తుకు కారకులు ఎవరని? మా ఉపాధి భవిష్యత్తులో ఎలా ఉంటుందనీ? వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఏ ఒక్క చేనేత కార్మికుని కదిలించిన బాధలే తప్ప, సుఖాలు లేవని చెప్పారు. చేనేత రిజర్వేషన్ చట్టములు అమలు చేసి చేనేత కార్మికుల ఉపాధిని పరిరక్షించాల్సిన అధికారులు పాలకులు కూడా చేనేతను చేరబట్టిన పవర్లూమ్స్ యాజమాన్యంతో చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారని తెలిపారు. నేడు చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగిన కూడా, ఆ కుటుంబాలను పూర్తిగా ఆదుకున్నది లేదని వారు బాధను వ్యక్తం చేశారు. అనంతరం పలు తీర్మానాలతో కార్మికులతో ఆమోదం పొందారు. ఏప్రిల్ మూడవ తేదీన 36 గంటల పాటు నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు.
తీర్మానించిన విషయాలు:
మర మగ్గాలలో మిక్స్ చీరలను మాత్రమే తయారు చేయాలని, ప్రభుత్వం చేనేత రిజర్వేషన్ చట్టములు పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ గారి ఎమ్మెల్యే గాని చట్టం అమలుకు అడ్డుపడకూడదని తద్వారా చట్టాన్ని గౌరవించాలని, చేనేత కార్మికులకు సిల్కు సబ్సిడీ స్కీమును పునరుద్దించాలని, ఆప్కో ద్వారా రాయితీతో కూడిన రా మెటీరియల్ను సరఫరా చేసి చేనేత చీరలను కొనుగోలు చేయాలని, ప్రతి చేనేత కుటుంబానికి 15 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని, ధర్మవరం పట్టణంలో మెగా చేనేత క్లస్టర్ను ఏర్పాటు చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు ఒకటిన్నర లక్ష నుండి 5 లక్షలకు ఎక్స్గ్రేషియా పెంచాలని, చేనేతపై జిఎస్టిని తొలగించాలని తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. దసలవారీగా మా పోరాటాలు సలిపి మా సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మందికి పైగా పట్టణ గ్రామీణ చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img