Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

వైఎస్‌ఆర్‌ జగనన్న భూహక్కు, భూరక్ష పథకంతో అక్రమాలకు అడ్డుకట్ట

ఎమ్మెల్యే తోపుదుర్తి

విశాలాంధ్ర-రాప్తాడు : వైఎస్‌ఆర్‌ జగనన్న భూహక్కు, భూరక్ష పథకంతో రెవెన్యూలో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం
అనంతపురం రూరల్‌ మండలం కామారుపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి , ఎంపీ గోరంట్ల మాధవ్ తో కలిసి వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సాగులో ఒకరు ఉంటే ఆన్‌లైన్‌లో ఒకరు ఉన్నారు. లోపభూయిష్టమైన పద్దతులతో ఇష్టానుసారంగా ఆన్‌లైన్‌లో పేర్లు ఎక్కించుకున్నారన్నారు. కనగానపల్లి మండలంలో ఆన్లైన్లో ఈరోజు నాపేరు మీద ఉన్న భూమి రేపు ఉంటుందా? అనే విధంగా తయారు చేశారన్నారు. భౌగోళికంగా ఉన్న భూమికంటే ఆన్‌లైన్‌ రికార్డుల్లో 27 వేల ఎకరాల భూమి ఎక్కువగా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించవచ్చన్నారు. ఒక సర్వే నంబరులో 150 ఎకరాల భూమి ఉంటే 400 ఎకరాల భూమి ఆన్‌లైన్‌లో ఎక్కించారని, గుట్ట, వాగు,వంక, పొరంబోకు, గ్రామకంఠం, గుడి, గోపురాన్ని ఇలా అన్నింటినీ సర్వే నంబరు క్రియేట్‌ చేసి ఆన్‌లైన్‌ చేసుకుని ఈపాస్‌ బుక్కులో ఎక్కించుకున్నారన్నారు. దీంతో రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని, ఇవన్నీ గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలకు, పార్టీలకతీతంగా భూమి ఎవరి పేరు మీద ఉంటుందో… ఎవరైతే సాగులో ఉన్నారో వారికే శాశ్వతంగా హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
1928లో డైక్లాయిడ్‌ అనే తెల్లదొర సర్వే చేయించి హక్కులు కల్పిస్తే మళ్లీ ఈరోజు జగనన్న భూములు సర్వే చేయించి శాశ్వత హక్కులు కల్పిస్తున్నాడు. ప్రతి రైతుకు, ప్రతి వ్యక్తికి తన ఆస్తి, భూమిపై మమకారం ఉంటుంది. మా భూములు మాతోనే ఉండాలి మా తర్వాత మాపిల్లలకు హక్కులు రావాలి అందుకు ఎలాంటి అడ్డుంకులు ఉండకూడదని కోరుకుంటారు. భూహక్కు పత్రాలు పొందిన రైతులు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చు. అత్యాదునిక పరికరాల ద్వారా భూములను సర్వే చేయిస్తున్నారు. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేశారు. ఎవరూ చెరపలేనటువంటి గ్రంధం భూహక్కు పత్రమన్నారు. ఆర్డీఓ మధుసూదన్, సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ వెంకట చెన్నయ్య, తహశీల్దార్ శ్రీధర్ మూర్తి, సర్పంచ్ మూలి లక్ష్మీకళలోకనాథ్ రెడ్డి, ఎంపీపీ గుజ్జల వరలక్ష్మి, జెడ్పీటీసీ జూటూరు చంద్ర కుమార్, ఎర్రగుంట రజిత రామకృష్ణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img