Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అప్పర్‌ భద్ర ప్రాజెక్టు ను వ్యతిరేకిద్దాం

రాయలసీమ నికర జలాలను కాపాడుకుందాం
విశాలాంధ్ర-పెనుకొండ :
స్థానిక తెలగుదేశం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవిత చేతులు మీదుగా రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ నాయకులు అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ ను వ్యతిరేకిస్తూ కరపత్రాలు విడుదల చేయటం జరిగింది.ఈసందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత,ఐటిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి మంజునాథ్‌ మరియు రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ నాయకులు సీమకృష్ణ,రవింద్ర నాయక్‌ నాగభూషన్‌,సంతోష్‌ మాట్లాడుతూ నికర జలాల పరిరక్షణకు కలిసి వచ్చే ప్రజా సంఘాల,ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో తుంగభద్ర పై ఆధారపడి కొనసాగుతున్న హెచ్‌ ఎల్‌ సి,ఎల్‌ ఎల్‌ సి, ఆర్డిఎస్‌, కే.సి కాలువల ‘‘నికర జలాల పరిరక్షణ ఈనెల 25 న పాదయాత్ర రాజోలి బండ నుంచి రిక్రియేషన్‌ క్లబ్‌ గ్రౌండ్‌ ఆదోని వరుకు రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రతో రిక్రియేషన్‌ మైదానంలో రాయలసీమ ప్రజాప్రదర్శనతో 28 న ముగుస్తుంది అన్నారు.అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ కడితే రాయలసీమ ఏడారిగా మారుతుందన్నారు.రాయలసీమలో సాగునీరు త్రాగునీరు కూడ ఉండదన్నారు.అన్ని పార్టీలు కలిసోచ్చి అప్పర్‌ భద్రను వ్యతిరేకిద్దామని వారన్నారు.ఈకార్య్రక్రమంలో రమేష్‌,స్వామీ గోపాల్‌,హరినాయుడు,బజారి తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img