Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు విధానంపై అవగాహన సదస్సు… ఆర్డిఓ తిప్పే నాయక్

విశాలాంధ్ర-ధర్మవరం : ఈనెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆర్డిఓ తిప్పే నాయక్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానమును వారు పూర్తిగా వివరించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 13న శాసనమండలి, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించబడునని, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఓటర్లు ఓటు వేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఇవ్వబడ్డ వైలెట్ కలర్ పెన్నుతోనే క్రమ సంఖ్యలు 1,2,3 లేకపోతే రోమన్కలు కూడా వాడి, వారి ప్రాధాన్యత ఓటును వేయవచ్చు నన్నారు. ఓటర్లు తప్పనిసరిగా తమ వెంట ఓటర్ స్లిప్ తో పాటు ఆధార్ కార్డు లేదా ఏదైనా ఐడెంటి కార్డు తీసుకొని పోలింగ్ కేంద్రాలకు రావాలని తెలిపారు. ఓటర్లకు పంచబడుతున్న ఓటర్ స్లిప్పుల వెనుక కూడా ఓటు వేసే విధానంపై ఇంగ్లీషు, తెలుగులో వివరంగా తెలుపబడ్డ య నీ, దానిని అందరూ ఓటర్లు చదువుకొని, వాటిని పాటించా లన్నారు. అనంతరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రదేశాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ముదిగుబ్బ తహసిల్దార్ నాగేంద్ర , ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img