Friday, April 26, 2024
Friday, April 26, 2024

లింగ నిర్ధారణ, ఫోక్సో చట్టం పై అవగాహన సదస్సు..

దర్శనమల మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత
విశాలాంధ్ర- ధర్మవరం : మండల పరిధిలోని దర్శనమల జడ్పీ హైస్కూల్ లో శుక్రవారం మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత ఆధ్వర్యంలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారికి విధించబడే శిక్ష, ఫోక్సో చట్టము, బాలికల వ్యక్తిత్వ వికాసం గూర్చి అవగాహనను కల్పించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు నిర్వహించి, ప్రతిపక్షలపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానమును నిర్వహించారు. బాలికలందరూ కూడా విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోవడం తగదని, ఉన్నత విద్య చదివేలా లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ఫోక్స్వ చట్టం, దిశా యాప్ లాంటివి బాలికలు పూర్తి అవగాహన చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ కళావతి, హెల్త్ సూపర్వైజర్లు కామేశ్వరి, జయ కుమారి, పాఠశాల హెచ్ఎం.. గోపాలకృష్ణ, ఉపాధ్యాయులు ఏఎన్ఎం అపర్ణ ,జ్యోతి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, మహిళా పోలీసు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img