Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

కళాశాలలను సీజ్ చేయాలి….ఏఐఎస్ ఎఫ్

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని నారాయణ కళాశాలలో ధర్నా చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ ఎఫ్ నియోజవర్గ అధ్యక్షుడు ఎన్.వేణుగోపాల్ ,నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.వినోద్ మాట్లాడుతూ ఫీజులు కడతారా చస్తారనే పద్ధతిలో విద్యార్థులు భయాందోళన గురి చేస్తూ దుర్భసలాడుతున్న నారాయణ కళాశాల ప్రిన్సిపల్ గారిపై, కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలన్నారు.నిన్నటి రోజున ఒక విద్యార్థిని చాలా అవమానంగా మాట్లాడిన లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి సంఘటన పునరాగం కాకుండా అధికారులు చొరవ తీసుకొని ఫీజుల కోసం వేధిస్తున్న నారాయణ కళాశాలలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా నిన్నటి రోజున అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఫీజులు అని వేధిస్తుండటంతోనే అమ్మాయి కళాశాల భవనం పై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందన్నారు.అమ్మాయి ఆరోగ్యం బాగుపడేంత వరకు నారాయణ కళాశాల యాజమాన్యమే అన్ని విధాల వైద్య ఖర్చులు భరించాలన్నారు. విద్యార్థినికి న్యాయం జరిగేంతవరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఫీజుల కోసం భయంకరంగా వేధిస్తున్న నారాయణ డీజిఎం వెంకటరామిరెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను ఆత్మహత్య ప్రయత్నంలో అరికట్టాలంటే అధికారుల చర్య తీసుకొని ఫీజు కోసం వేధిస్తున్నటువంటి కళాశాలలను వెంటనే సీజ్ చేయాలని ఇప్పుడైనా అధికారులు నిద్ర మేలుకొని విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడకుండా నారాయణ కాలేజీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని హెచ్చారించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.ఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి లు పి.అఖిల్ ,రాజ్ కుమార్ ,శ్యాంసుందర్, పట్టణ నాయకులు రాము, రాజేష్, శిక్షావలి , నాగేంద్ర,తేజ, చిన్న, వేణు , వంశీ, హర్షరఫ్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img