Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రణయ్ రెడ్డి నియామకంతో ఉరవకొండలో సంబరాలు

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జోనల్ అధ్యక్షులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నియమించడంతో బుధవారం ఉరవకొండలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. స్థానిక టవర్ క్లాక్ సమీపంలో కేక్ కట్ చేసి ప్రణయ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రణయ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన నాయకులు సింగాడి ధనరాజ్, వడ్ల సలీం, ఉరవకొండ ఉపసర్పంచ్ వన్నప్ప, వీరితో పాటు వైఎస్ఆర్సిపి పార్టీ పట్టణ కన్వీనర్ ఓబులేసు, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, వైస్ ఎంపీపీ నరసింహులు, రాష్ట్ర నాయకులు బసవరాజు, పార్టీ నాయకులు బసన్న, వసికేరి రమేష్,ఆసిఫ్, టౌన్ బ్యాంక్ అధ్యక్షులు సాదు కుల్లాయి స్వామి, మీరం భాష, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img