Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బాల్య వివాహాల నిరోధానికి సమన్వయంతో కృషి చేద్దాం

డీసీపీఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర-రాప్తాడు : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటి అన్ని శాఖల నిరోధానికి సమన్వయంతో కృషి చేద్దామని డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశాల మేరకు గురువారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో మండలాధికారులు, ఐసీడీఎస్, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఏఎన్ఎంలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలుంటాయని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా మండలంలో పూర్తిగా అరికట్టవచ్చన్నారు. పిల్లలను బడికి మాన్పించి చిన్న వయస్సులోనే బాల్
వివాహాలు చేయడం వల్ల వారి జీవితాన్ని చిదిమేస్తున్నారన్నారు. ఆడపిల్లల రక్షణకు గాను ప్రత్యేక చట్టం ఉందని, ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పకడ్బందీగా కృషి చేయాలన్నారు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లలోపు వారికి వివాహం చేయడంనేరమని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాల్యంలో పెళ్లిళ్లు ఇష్టంలేని కొంతమంది అమ్మాయిలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1098కు సమాచారం ఇస్తున్నారని..ఈ హెల్ప్ లైన్ నంబరును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఐ. సి. డి. ఎస్, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అధికారులు బాల్య వివాహాలు అరికట్టడానికి కృషి చేయాలన్నారు.  బాల్య వివాహం జరిగినట్టు నిర్ధారణ అయితే చట్టప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ. ఒక లక్ష జరిమానా విధిస్తూ, పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరిని బాధితులు చేసేందుకు అవకాశం ఉందన్నారు. బాల్యవివాహాలు అరికట్టడానికి గ్రామాల నుంచే వివాహ నమోదులు తప్పని సరిగా చేయాలన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ జయలక్ష్మి, ఎంపీడీఓ సాల్మన్, తహశీల్దార్ లక్ష్మీనరసింహ, ఎస్ఐ ఆంజనేయులు, ఈఓఆర్డీ మాధవి, వైకేపి ఏపీఎం శివకుమార్ రెడ్డి, సీడీపీఓ ధనలక్ష్మి, ఐసీడీఎస్ సూపవైజర్ నాగరత్న, ఎస్బీసీసీ డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్ నాగేంద్ర, ఎన్ఐసీ పీఓ చంద్రకళ, వైసీపీ యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img