Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మహిళా రెజ్లర్ల పోరాటానికి మద్దతుగా ర్యాలీ…

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్ టియు ) ఆధ్వర్యంలో మంగళవారం సిపిఐ(ఎంఎల్ )న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా 60 అడుగుల రోడ్డు మీదుగా పొట్టి శ్రీరాములు కూడలి వరకు ర్యాలీ నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్ మాట్లాడుతూ…ఢిల్లీలో మహిళా రెజ్లర్ల ను బిజెపి ఎంపీ ,ఆల్ ఇండియా రెజ్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని అతని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్న తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో మహిళ రెజ్లర్ల సుప్రీంకోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా అతని మీద కేసును నమోదు చేయించడం జరిగినదన్నారు. అయినా ఇప్పుడు వరకు అతన్ని అరెస్టు చేయలేదన్నారు. మహిళ రెజ్లర్ల తమకు జరుగుతున్న అన్యాయం మీద మోడీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఏప్రిల్ 23 వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర నిరవధిక నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు.దాదాపుగా 24 రోజులు అవుతున్న ఎంపీ బ్రిజ్ భూషణ్ ను పోలీసులు అరెస్టు చేయలేదని మోడీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతున్నదన్నారు. దేశవ్యాప్తంగా పౌర సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత రావడం జరుగుతున్నదన్నారు. బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలంతో వ్యవహరిస్తుండడంతో వివిధ రాష్ట్రాలలో మహిళల మీద అత్యాచారాలు , లైంగిక వేధింపులు , మర్డర్లు నిత్యం జరుగుతున్నాయన్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్లో అసిఫా భాను చిన్నారిని , గుజరాత్ లో బిల్ కిష భాను అత్యాచార సంఘటనలు జరిగినప్పుడు బిజెపి పార్టీ నాయకులు , కార్యకర్తలు , ఎమ్మెల్యేలు రోడ్ల మీదికి వచ్చి అత్యాచారాలకు అనుకూలంగా మాట్లాడడం జరిగినదన్నారు. మహిళలను నీచంగా చూడడం , కించపరచడం బిజెపి , ఆర్ఎస్ఎస్ నాయకులకు అలవాటుగా మారినదన్నారు. వీరికి మహిళల పైన ఉన్న దుర్మార్గపు ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఎంపీ బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా రెజ్లర్ల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ ర్యాలి నిరసనలో ఐఎఫ్టియు డివిజన్ కమిటీ అధ్యక్షకార్యదర్శిలు శ్రీరాములు,చిన్నా, ప్రగశీల మహిళా సంఘం( పిఓడబ్ల్యూ ) నియోజకవర్గ కార్యదర్శి ఆశాబీ,పట్టణ కార్యదర్శి మాౠనీ , ఐ ఎఫ్ టి యు కమిటీ సభ్యులు భాష , వీరేంద్ర , గోపి , షేక్షావలి , జానయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img