Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మూడు వాహనాలలో దర్శనమిచ్చిన చెన్నకేశవ స్వామి

-ఆలయచైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం వారి బ్రహ్మోత్సవ వేడుకలు ఈనెల 27వ తేదీ నుండి మే నెల 7వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ వైస్ చైర్మన్ కుండా చౌడయ్య,ఆలయ డైరెక్టర్లు, దాతలు, భక్తాదుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం పుష్ప మండపము, మధ్యాహ్నం వసంతోత్సవము, (చక్రస్నానం) సాయంత్రం హంస వాహనం లలో స్వామివారు పట్టణ పురవీధులలో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్, గుణ శేఖర్ స్వామి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయ దాతలైన వెంకటేశులు ( చిట్టి) సన్స్, వంకదారి కేశవ రామానుజ ప్రసాద్ అండ్ సన్స్, నాగమణి, తిరుచానూరు హరిప్రసాద్, కృష్ణమూర్తి, రామ్మోహన్, రంగమన్నార్ ,రవికృష్ణ, వినోద్ కుమార్ పేరిటన అర్చనతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘనంగా స్వామివారి ఎదుట ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సత్కరించారు. స్వామివారి అలంకరణ, అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం గానం చేసిన సంకీర్తనలు, భజనలు, తదుపరి గోదా రంగనాథ మహిళా మండలి వారు ప్రదర్శించిన కోలాటం లు భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. తదుపరి ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవ వేడుకలు మే 7వతేదీ తో ముగుస్తాయన్నారు. ఈ వేడుకలు కమిటీ, దాతల సహాయ సహకారములతో నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు జగ్గా జయలక్ష్మి, పోరాల్ల పద్మావతి, సత్రశాల సత్యనారాయణ, సౌందర్య లహరి సునీత, గిర్రాజు మహాలక్ష్మి, అన్నమయ్య సేవా మండలి పోరాల్ల పుల్లయ్య, వారి శిష్య బృందం, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img