Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాజీనామాను ఆమోదం తెలిపిన కౌన్సిలర్లు

ధర్మవరం : పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల ఇటీవల పదవీకాలం ముగియడంతో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కౌన్సిల్ సమావేశమును ఇన్చార్జి కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో లింగం నిర్మల యొక్క రాజీనామా ఆమోదమును కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఆమోదం తెలపడం జరిగిందని ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. అనంతరం నూతన చైర్మన్ విషయంలో త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు. తదుపరి మాజీ మున్సిపల్ చైర్మన్ లింగ నిర్మల మాట్లాడుతూ నా హయాంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెం బర్లు,అందరూ కూడా ఎంతగానో సహకరించి పట్టణ అభివృద్ధికి పాటుపడినందుకు పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి మున్సిపల్ ఆర్వో, మేనేజర్ ఆనంద్ మాట్లాడుతూ చైర్మన్ లింగం నిర్మల వారి హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, పురపాలక సంఘ కార్యాలయంలోని అన్ని విభాగాలలోని పనులు కూడా అనతి కాలంలోనే పూర్తి పరిష్కారానికి నోచుకోవడం జరిగిందని వారు తెలిపారు. మున్సిపల్ ఆఫీస్ అధికారులు సిబ్బంది తరుపున లింగం నిర్మలకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. తదుపరి కౌన్సిలర్లు అందరూ కూడా లింగం నిర్మలకు ధర్మవరాన్ని అభివృద్ధి బాటలో నడిపినందుకు ప్రత్యేక కృతజ్ఞత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ విభాగం ఈఈ. సత్యనారాయణ, సానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికునికి చేయూత:: మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న లింగన్న ఇటీవల అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు తోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల రూ.51,500, ఆరవ వార్డు కౌన్సిలర్ కాచెర్ల లక్ష్మీ పదివేల రూపాయలు, మరొక కౌన్సిలర్ పురుషోత్తం రెడ్డి 5000 రూపాయలు వెరసి రూ.66,500 లను లింగన్నకు నగదును అందజేశారు. ప్రమాదం జరిగిన రోజునే అప్పటి కమిషనర్ మల్లికార్జున శానిటరీ ఇన్స్పెక్టర్ భాషలు లింగన్నకు పదివేల రూపాయల నగదు, సచివాలయ శానిటరీ కార్యదర్శులు 7వేల రూపాయలు అందజేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img