Friday, May 3, 2024
Friday, May 3, 2024

రైతులతో ముఖాముఖి.. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి

విశాలాంధ్ర- ధర్మవరం : మండల పరిధిలోని దర్శనమల గ్రామంలో గల రైతు భరోసా కేంద్రంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. అనంతరం వారు రైతులతో మాట్లాడుతూ ఈ -కై తమ పరిధిలోని ఆర్ బి కే లో చేయించుకోవాలని, సున్నా వడ్డీ, పంట రుణాల కొరకు, ప్రతి రైతుకు సంవత్సర కాలంలో రుణాలతో పాటు రెన్యువల్ కూడా చేసుకోవాలని తెలిపారు. రవి 2022 కాలానికి పంటవేసిన ప్రతి రైతు ఈక్రాప్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. రైతులకు కావలసిన ఎరువులను రైతు భరోసా కేంద్రం ద్వారానే సరఫరా చేయాలని తెలిపారు. రైతులు వేరు శనగ సాగు చేసిన పంటకు జిప్సం ఎరువును కచ్చితంగా వాడాలన్నారు. అదేవిధంగా పంటలకు అవసరమైనప్పుడు పురుగుల మందులు కూడా పిచికారి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు ధర్మవరం కృష్ణయ్య, జిల్లా వనరుల క్షేత్రం పుట్టపర్తి ఏ డి ఏ సనావల్ల, విద్యావతి మండల వ్యవసాయ అధికారి, రైతు భరోసా కేంద్ర గ్రామ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img