Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

విద్యార్థులు ఇష్టపడి, కష్టపడి చదవాలి

మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్ప

విశాలాంధ్ర -ఉరవకొండ : విద్యార్థులు ఇష్టపడి, కష్టపడి నైతిక విలువలతో కూడిన విద్యను క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఉరవకొండ మండల విద్యాశాఖ అధికారి ఎం ఈశ్వరప్ప అన్నారు. శనివారం ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు మానసిక ఉల్లాసాన్నిచ్చే ఆటలలో కూడా పాల్గొనాలన్నారు విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయి విద్యావంతులు కావలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ రాజశేఖర్, బాలకృష్ణ,సదాశివ ఆదిమూర్తి, వెంకటేశులు, సుశీల, జుబేదా శ్వేత, మనోజ్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img