Friday, May 3, 2024
Friday, May 3, 2024

వేసవి శిక్షణ తరగతులు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి.. ఉపాధ్యాయులు

విశాలాంధ్ర -ధర్మవరం : వేసవి శిక్షణా తరగతులు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని టీచర్ నరసింహులు, గీత, నాగరాజు-ఎల్ఐసి ఏజెంట్, శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వేసవి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే చదువుతోపాటు ఆటల యొక్క పరికరాలను కూడా ప్రదర్శించడం జరిగిందన్నారు. గ్రంథాలయాలు జ్ఞాన సంపద కలగజేస్తుందని, వేసవి సెలవులను వృధా చేసుకోకుండా ఈ శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. శిక్షణా తరగతుల్లో భాగంగా ఇండోర్ గేమ్స్ లో శిక్షణ, తదుపరి విద్యార్థులకు కథలు,ఇంగ్లీష్ గ్రామర్ లాంటివి కూడా నేర్పించడం జరుగుతుందన్నారు. తదుపరి గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ గ్రంథాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. గ్రంథాలయములో ఉచిత సభ్యతమును కూడా దాతల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ ముకుందా, గీత, మురళి, నారాయణస్వామి, గ్రంథాలయ సిబ్బంది సత్యనారాయణ, రమణా నాయక్, శివమ్మ, గంగాధర్, పాఠకులతో పాటు 45 మంది విద్యార్థులు, ఏడు మంది రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img