Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వ్యాధినిరోదక టీకాలు ఉత్తమ ఫలితాలు : డీఎంహెచ్ఓ వీరబ్బయ్య దొర

విశాలాంధ్ర-రాప్తాడు : చిన్న పిల్లలకు సోకే ప్రాణాంతక వ్యాధుల నిర్మూలనలో వ్యాధినిరోదక టీకాలు ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయని డీఎంహెచ్ఓ వీరబ్బయ్య దొర తెలిపారు. శనివారం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్ లో జరుగుతున్న టీకా కార్యక్రమాన్ని డీఐఓ డాక్టర్ యుగంధర్ తో కలిసి పరిశీలించారు. తట్టు టీకాల ఆవశ్యకత గురించి తల్లులకు తెలియజేశారు. తట్టు టీకా పిల్లలకు వేయించని కారణంగా కొన్ని ప్రాంతాల్లో వ్యాధి తీవ్రరూపం దాల్చిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. పిల్లలకు ఉచితంగా వేసే తట్టు టీకాను పిల్లలు పుట్టిన 9, 15 నెలల వయస్సులో తప్పక ఇప్పించాలన్నారు. తట్టు ఎక్కువగా ఐదు సంవత్సరాలలోపు వయస్సులోపు పిల్లలకు సోకే పురాతన, ప్రాణాంతక వైరస్‌ కారక వ్యాధి అని, వాంతులు, విరేచనాలు, న్యుమోనియా, మెదడుకు ఇన్ఫెక్షన్‌ సోకి ప్రాణాంతకం కావచ్చని, తేలికపాటి జ్వరం, జలుబు, దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, చర్మంపై దద్దుర్లు ఇవి తట్టు లక్ష్యణాలని అన్నారు. దీనికి విశ్రాంతి, ద్రవాహారాలిస్తూ జ్వరాన్ని అదుపులో ఉంచుకుంటూ…దగ్గర్లోని ప్రభుత్వ వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ మనోజ్, ఎంఎల్హెచ్పీ ప్రసన్నకుమారి, ఏఎన్ఎం చంద్రకళ, అంగన్వాడీ టీచర్ యల్లమ్మ, ఆయా విజయలక్ష్మీ, ఆశా కార్యకర్తలు శివలక్ష్మి, నాగేంద్రమ్మ, లక్ష్మీ, ఈరమ్మ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img