Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

శ్రీ వాణి కళాశాలలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టండి ప్రముఖ సైకాలజిస్ట్ రామ్ జలదుర్గం

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ప్రతి విద్యార్థి తమ తల్లి తండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను మంచి మార్గంలో సద్వినియోగం చేసుకుంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టాలని ప్రముఖ సైకాలజిస్ట్ రామ్ జలదుర్గం పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీ వాణి డిగ్రీ పీజీ కళాశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కె. వనజమ్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కళాశాల కరస్పాండెంట్ నీలం చిన్నపరెడ్డి, ప్రముఖ సైకాలజిస్ట్ రామ్ జలదుర్గం పాల్గొన్నారు. ముందుగా ఎన్ సి సి విద్యార్థులు గౌరవ వందనముతో ముఖ్య అతిథులకు స్వాగతం పలుకుతూ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజిస్ట్ మాట్లాడుతూ… ప్రతి విద్యార్థి రోజు సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యం వైపు గురి పెట్టాలన్నారు. మీకు ఇష్టమైన విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ కష్టమైన దానిని సాధించడానికి ప్రయత్నించినప్పుడే విజయం మీ వెంట ఉంటుందన్నారు. ఆత్మవిశ్వాసం, సామర్థ్యం, నిబద్ధత కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్, ఎన్ సి సి, క్రీడల్లో, విశేష ప్రతిభ చూపిన విద్యార్థులకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్,మెమెంటోల ను అందజేశారు. అనంతరం ప్రముఖ సైకాలజిస్ట్ ను కళాశాల కరస్పాండెంట్, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎంబీఏ ప్రిన్సిపాల్ బి. భాస్కర్ రెడ్డి, పీజీ ప్రిన్సిపాల్ వైవి నాగరాణి, అధ్యాపకులు ఏ సుధీర్ రెడ్డి,జి ప్రత్యూష, నర్మదా, మాధవి,స్వర్ణలత, మంజుల, నరస నాయుడు, కిరణ్ కుమార్, చలపతి, నందకుమార్ రెడ్డి, ఆంజనేయులు, మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img