Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సంక్షేమ సారధిని ఆశీర్వదించండి

గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని 18 వ వార్డు నందు సోమవారం ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఎమ్మెల్సీ మంగమ్మ ఇరువురు కలిసి వార్డులో వీధి వీధి పర్యటిస్తూ సంక్షేమ సారధిని ఆశీర్వదించండి అంటూ గడపగడపకు వెళ్లి ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ వారికి ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచార పత్రాన్ని అందజేస్తూ ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకుంటూ అన్ని సక్రమంగా అందుతున్నాయా లేదా ఇంకా అర్హులైన లబ్ధిదారులు సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే తెలియజేయాలని కోరుతూ గడపగడపకు తిరిగారు త్రాగునీరు, సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్రాగునీటి సమస్యను త్వరలో పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించామని నగర పంచాయతీలో 87 లక్షలతో తాగునీటికి ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నామని ట్యాంకులు నిర్మాణం చేపడతామని డ్రైనేజీ వ్యవస్థ సిమెంట్ రోడ్లు వేయడానికి ప్రతిపాదనలు పంపామని పట్టణాన్ని సుందరీ కరణ చేయుటలో నిమగ్నమైనమని కావున సంక్షేమ సారధిని తప్పక దీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో 18 వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందిని, జయశంకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఉమర్ ఫరూక్, వైస్ చైర్మన్ సునీల్, నగర పంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివశంకరప్ప, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, ఇతర కౌన్సిలర్లు అగ్రి చైర్మన్ కొండలరాయుడు, సర్పంచులు ఎంపీటీసీలు డైరెక్టర్లు అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img