Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు..: వాతావరణ శాఖ హెచ్చరిక.

.నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతంలోని హిందూ మహాసముద్రం మీద ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటలలో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది నవంబర్‌ 9 నుంచి 11 వరకు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని కారణంగా రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రా, యానాంలో నవంబర్‌ 8వ తేదీ, 9, 10న వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. అలాగే అటు దక్షిణ కోస్తాంధ్రాలో ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురుస్తాయని.. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
రాయలసీమలో ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img