Friday, April 26, 2024
Friday, April 26, 2024

మళ్లీ పడిపోయిన టమాట ధరలు.. ఆందోళనలో రైతులు

మొన్నటిదాకా రూ.40 వరకు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు ఏకంగా రూ.2 నుంచి 4 వరకు పలుకుతోంది. దీంతో కర్నూలు జిల్లా టమాటా రైతులు బోరుమంటున్నారు. నిన్నమొన్నటి వరకు కిలో భారీగా పలికిన టమాటా ధర ఒక్కసారిగా 2 రూపాయలకు పడిపోవడంతో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్నారు. దిక్కుతోచని రైతులు వాటిని అక్కడే పారబోసి వెళ్లిపోయారు. ఒక ఎకరాలో టమాటా పంట పండిరచేందుకు రైతులు రూ.30 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చాక ధర అమాంతం పడిపోవడంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మార్కెట్‌ లో పరిస్థితి ఇలా ఉంటే బహిరంగ మార్కెట్‌ లో మాత్రం కిలో టమాటా రూ. 20 నుంచి రూ. 30 పలుకుతుండడం గమనార్హం. కిలోకు రూ.10-15 అయినా లభిస్తే తమకు కొంతవరకు గిట్టుబాటు అయ్యేదని రైతులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img