Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉపాధ్యాయ సంఘాల నేతల ఆరోపణలు అర్థం లేనివి

పీఆర్సీ సాధన సమితి నేతలు
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేశామని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వారథిలా పనిచేశామన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతల ఆరోపణలు అర్థం లేనివని జేఏసీ నేతలు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో నాలుగు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంతో తమ చర్చలు ఆమోదయోగ్యంగా లేకుంటే ఉపాధ్యాయ సంఘాలే సమ్మె కొనసాగించాల్సిందని వ్యాఖ్యానించారు. చర్చలు ఆమోదయోగ్యంగా లేకుంటే అప్పుడే లేవనెత్తాల్సిందని పేర్కొన్నారు. వారి మాటల వెనుక కొన్ని శక్తులు దాగి ఉంండొచ్చని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ… జేఏసీ నేతలకు శవయాత్రలు చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సమిష్టి కృషి కారణంగానే.. ఫిట్మెంట్‌ మినహా అన్ని అంశాలు సాధించుకున్నామని చెప్పారు. పీఆర్సీ సాధన సమితికి కొందరు ద్రోహం చేశారన్నారు. ‘సమ్మె చేయాలనే ఉత్సాహం కొందరిలో ఉంది. సమ్మె జరగలేదనే ఫ్రస్టేషనతో సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.’ అని తెలిపారు. సూర్యనారాయణ మాట్లాడుతూ… గొప్ప పీఆర్సీ సాధించామని మేము చెప్పడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి ఫలితమని చెప్పామన్నారు. ఫిట్మెంట్‌ మినహా అన్ని అంశాల్లో మాత్రమే అంతో ఇంతో సాధించామని చెప్పారు. తమని మాట్లాడనివ్వలేదనే ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మమ్మల్ని తిడితే మీకు ఓట్లు వస్తాయనుకుంటే తిట్టుకోవచ్చన్నారు.బొప్పరాజు మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వంతో పారదర్శకంగా చర్చలు జరిపామన్నారు. చర్చల్లోని ప్రతి అంశంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉందన్నారు. ఎవరూ వ్యతిరేకించని విషయంపై వారికెందుకు ఒత్తిడి వచ్చిందని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారో చెప్పాలన్నారు. అన్నిటికీ ఒప్పుకుని ఇప్పుడు విమర్శలు చేయడం తగదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img