Friday, August 19, 2022
Friday, August 19, 2022

ఏపీలో కొత్తగా 2,145 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 85,297 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,145 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 19,73,246కు చేరింది. కరోనాతో మరో 24 మంది మృతిచెందారు. ప్రకాశంలో ఐదుగురు, చిత్తూర్‌లో నలుగురు, కృష్ణలో నలుగురు, కడపలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, అనంతపూర్‌లో ఒక్కరు, గుంటూరులో ఒక్క రు, విశాఖపట్నంలో ఒక్క రు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,468కు చేరింది. 24 గంటల వ్యవధిలో 2,003 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,39,476కి చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img