Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ఏపీలో పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్‌ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ వెలువరించేందుకు ఏపీ డీజీపీ ప్రభుత్వాన్ని కోరారు. పోలీస్‌ శాఖలో రిటైర్‌ మెంట్స్‌, పదోన్నతులు, మరణాలతో పాటు ఇటీవల ఏపీ ప్రభుత్వం పోలీస్‌ శాఖకు వీక్‌ ఆఫ్‌ ఇస్తుండటంతో సిబ్బంది తక్షణ అవసరం ఏర్పడిరది.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 6511 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్‌ విభాగంలో 3580 పోలీస్‌ కానిస్టేబుల్‌, 411 ఎస్‌ఐ పోస్టులు, 96 రిజర్వ్‌ ఎస్‌ఐ పోస్టులు 2520 ఏపీ స్పెషల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2023 ఫిబ్రవరి 19న ఎస్సై పోస్టులకు, 2023 జనవరి 22న కానిస్టేబుల్‌ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు తేదీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img