test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించండి.. సీఎంకు లోకేష్‌ లేఖ

: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని కోరుతూ సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో థర్డ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని సూచించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని పేర్కొన్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదన్న లోకేశ్‌.. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని సూచించారు. గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. గడిచిన పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుండి 5 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి వచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు.ఈ సమయంలో స్కూల్స్‌ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. జగన్‌ సర్కార్‌ అనాలోచిత నిర్ణయాలతో ఎంతోమంది ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పేరెంట్స్‌ ను మరింత మానసిక ఆందోళనకు గురి చేయకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని కోరారు. తక్షణమే స్కూల్స్‌?కి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img