Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఏపీ ఈఏపీసెట్‌’ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడ ఆర్‌అండ్‌బి కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల వెల్లడి సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ, 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. దాదాపు 80 శాతం మంది అర్హత సాధించారని వెల్లడిరచారు. విద్యార్థులు రేపటి నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. అగ్రి, ఫార్మా ఫలితాలు ఈ నెల 14న ప్రకటిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img