Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11 గంటలకి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 34,789(91.27శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్‌ ఫలితాల్లో 29,904 (92.53శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. రికార్డు స్దాయిలో ఏపీ ఇంజనీరింగ్‌ సెట్‌, ఐసెట్‌ ఫలితాలను ప్రకటిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఐసెట్‌కు 42 వేల దరఖాస్తు చేసుకున్నారని, 38 వేలమంది హాజరవ్వగా, 34789 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. దాదాపు 91 శాతం మంది అర్హత సాధించారని, పరీక్షా ఫలితాలని రేపటి నుంచి విద్యార్థులకి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img