Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఏపీ ప్రభుత్వానికి మరోసారి భంగపాటు తప్పదు : ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌

సుప్రీంలోనూ ఏపీ సర్కారుకు చెంపపెట్టులాంటి తీర్పు వస్తుందన్న పయ్యావుల
మూడు రాజధానులపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన అంశంపై టీడీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఏపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో మాదిరే సుప్రీంకోర్టులోనూ వైసీపీ సర్కారుకు మరోమారు భంగపాటు తప్పదని ఆయన చెప్పారు. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు శనివారం మద్దతు తెలిపిన సందర్భంగా రవీంద్రకుమార్‌ మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం వృథాగా పోదని పయ్యావుల కేశవ్‌ అన్నారు. సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి తీర్పు వస్తుందన్నారు. చట్టసభలను తక్కువ చేసేలా హైకోర్టు తీర్పు ఇవ్వలేదని ఆయన అన్నారు. కేవలం దురుద్దేశంతోనే ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం చేపట్టకుండా 6 నెలలు ఆగి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img