Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కుప్పంకు చేరుకున్న జగన్‌

వైఎస్సార్‌ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
కుప్పంలో రూ. 66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంకు ముఖ్యమంత్రి జగన్‌ చేరుకున్నారు. అంతకు ముందు విజయవాడ నుంచి రేణిగుంట ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ కుప్పంకు విచ్చేయడం ఇదే తొలిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్‌ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీకి సంబంధించిన రూ. 66 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ. 11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img