Thursday, May 30, 2024
Thursday, May 30, 2024

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు అనర్హుడు : షర్మిల

కేసీఆర్‌ దేశాన్ని ఏలతారన్నది పెద్ద జోక్‌ అని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ఎద్దేవా చేశారు. మంగళవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు అనర్హుడని అన్నారు. రాష్ట్రంలో కనీసం నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ కూడా లేదన్నారు. రాష్ట్రంలో బడులు, గుడుల కంటే వైన్స్‌ షాపులే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని తాగుబోతుల, అప్పుల, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని అన్నారు. బంగారు తెలంగాణ కాదు.. బతుకేలేని తెలంగాణగా చేశారని అన్నారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే తెలంగాణకు అంత మంచిదని అన్నారు. .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img