Monday, October 3, 2022
Monday, October 3, 2022

కోర్టు ధిక్కార కేసులో ఐదుగురు ఐఏఎస్‌లకు ఊరట

కోర్టు ధిక్కార కేసులో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది.2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లపై సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది. బాధితులకు ఇప్పటికే పరిహారం అందినట్లు ఐఏఎస్‌లకు కోర్టుకు తెలపడంతో ఈ కేసులో తీర్పును సస్పెండ్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్‌ అధికారులకు కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం తీర్పు వెలువరించారు. అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా న్యాయమూర్తి తన తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలుపుదల చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img