Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు, ఆయన సన్నిహితులు విచారం వ్యక్తంచేశారు.
‘గౌతమ్‌రెడ్డి తాత సమయం నుంచి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. నేనంటే ఎంతో అభిమానం. చూపేవారు. గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరం. గౌతమ్‌ ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు, ప్రజా సమస్యల పట్ల అవగాహన,పని పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు’ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్‌రెడ్డి మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేను. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.’ సీఎం జగన్‌
‘గౌతమ్‌రెడ్డి మృతి కలచివేసింది. ఎంతో భవిష్యత్‌ ఉన్న నాయకుడి మృతి బాధాకరం. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. ` టీడీపీ అధినేత చంద్రబాబు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img