Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌..

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే కక్ష సాధింపు చర్య : చంద్రబాబు

టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని అశోక్‌ బాబుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో విజయవాడలోని నివాసం నుంచి రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన్ను తరలించారు. గురువారం రాత్రి ఓ వివాహవేడుకకు హాజరైన అశోక్‌బాబు రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి వాహనంలో తరలించారు. అశోక్‌బాబును అరెస్టు చేసినట్లు, కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం ఇస్తూ ప్రకాశం జిల్లా కందుకూరువాసి మాదాల గోపికి నోటీసు అందించారు.
కాగా ఎమ్మెల్సీ అరెస్టుపై టీడీపీ స్పందించింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అశోక్‌బాబును సీఐడీ అరెస్ట్‌ చేసిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఉద్యోగ సమస్యలపై నిలదీస్తున్నందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. . సర్వీస్‌ విషయంలో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని.. అర్ధరాత్రి పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. అశోక్‌ బాబు అరెస్ట్‌పై కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మట్లాడిన పార్టీ అధినేత వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు.
అశోక్‌ బాబు అరెస్ట్‌ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్‌ తెలిపారు. జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు తగిన మూల్యం చెల్లిస్తుందని.. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే కక్ష సాధింపు చర్య అని ఆయన విమర్శించారు.టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరెంద్ర కుమార్‌ ఎమ్మెల్సీ ఆశోక్‌ బాబు అరెస్టును ఖండిరచారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధాన అంశాలపై చర్చను దారి మల్లించేందుకే ఈ అరెస్టు నాటకమాడుతోందన్నారు.కాగా అబద్ధపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన జగన్‌ రెడ్డి అరాచకంతో పాలన సాగిస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వైఫల్యాలు, తప్పుల్ని ప్రశ్నించిన టీడీపీ నేతల్ని అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో వేధిస్తున్నారన్నారు.గతంలో అశోక్‌ బాబు పై వచ్చిన ఆరోపణలపై ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలినా కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం జగన్‌ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడుగా అశోక్‌ బాబు.. వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ఉద్యోగుల్ని చైతన్యంవంతం చేస్తున్నాడన్న కడుపుమంటతోనే ఆయనపై కక్ష్యసాధిస్తున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, అశోక్‌ బాబును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.ఎమ్మెల్సీ అశోక్‌ బాబు అక్రమ అరెస్ట్‌ ను ఖండిరచిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఖండిరచారు. ఉద్యోగులలో ప్రభుత్వం పై వచ్చిన వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే అశోక్‌ బాబు అరెస్ట్‌ జరిగిందన్నారు. ఉద్యోగులు హక్కుల కోసం మాట్లాడమే అశోక్‌ బాబు చేసిన నేరమా ? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img