Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

డిసెంబర్‌ 5న ప్రధాని మోదీ సమావేశం.. చంద్రబాబుకి ఆహ్వానం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ప్రధాని మోదీ నుండి ఆహ్వానం అందింది. డిసెంబర్‌ 5వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరగనుంది.డిసెంబర్‌ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందడం విశేషం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఫోన్‌ చేసి స్వయంగా చంద్రబాబును ఆహ్వానించారు. తదుపరి జీ20 భాగస్వామ్య దేశాల సదస్సు భారత్‌ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు గురించి పార్టీల అధ్యక్షుల సమావేశంలో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశం ద్వారా రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్రం తెలుసుకోనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img