Monday, March 27, 2023
Monday, March 27, 2023

తాడేపల్లిగూడెంలో చేపల లారీ బోల్తా..నలుగురు దుర్మరణం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా దువ్వాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చేపలలోడుతో లారీ వెళుతోంది. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు జాతీయ రహదారి 216 వద్దకు రాగానే అదుపతప్పి లారీ బోల్తాపడిరది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతులు బీహార్‌ కి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి డ్రైవర్‌ మద్యం మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img