Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

దక్షిణాది రాష్ట్రాలన్నింటికంటే ఏపీలోనే విద్యుత్‌ చార్జీలు అధికం


చంద్రబాబు
దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్‌ చార్జీలు అధికంగా పెంచారని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని అన్నారు. డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇవాళ అమరావతిలో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనడానికి కృత్రిమంగా విద్యుత్‌ కొరత సృష్టించారని అన్నారు. తెలంగాణకు లేని సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img