Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

దసరాకు ప్రత్యేక బస్సులు..50శాతం అదనపు ఛార్జీలు : ఆర్టీసీ ఎండీ

దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దసరా సందర్భంగా 4 వేల ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడిరచారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు వెల్లడిరచారు. అయితే ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు అమలు చేస్తామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇక రెగ్యులర్‌ సర్వీసులు మాత్రం రద్దు కావన్నారు. వాటిలో సాధారణ ఛార్జ్‌లే ఉంటాయన్నారు. ఆన్లైన్‌లో రెగ్యులర్‌ సర్వీస్‌ల టిక్కెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలను దోచెయ్యలని భావించదని.. మనుగడ కోసమే చార్జీల పెంపు అని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img